మైనర్ బాలికపై అత్యాచారం.. రేపిస్ట్‌కి జీవితఖైదు విధించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌లోని శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఫూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అక్రమ్‌ఖాన్ అనే వ్యక్తి 2015 డిసెంబర్ 17న మైనర్ బాలికను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్న శాలిబండ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read: ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి అక్రమ్‌ఖాన్‌పై ఛార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అక్రమ్‌ఖాన్ నేరం చేసినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించడంతో న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించింది. దీంతో సెషన్స్ జడ్జి సునీత కుంచాల అతడికి జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. Also Read:
By August 18, 2020 at 10:53AM
No comments