Breaking News

సాయి ధరమ్ తేజ్ మనసులో మాట ఇదే.. సోలో బ్రతుకే సో బెటర్ సెకండ్ సాంగ్ అదుర్స్


జయాపజయాలతో పనేంటి అంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మెగా మేనల్లుడు . టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఈ హీరో.. ప్రస్తుతం '' సినిమా చేస్తున్నాడు. ఓ వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ.. చివరకు అతనే ఎలా ప్రేమలో మునిగాడో తెలిపే కథను నేటి యువతకు కావాల్సిన అన్ని అంశాలు జోడించి ఆసక్తికరంగా మలుస్తూ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రూపొందించాడు నూతన దర్శకుడు సుబ్బు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ''నో పెళ్లి'' రిలీజ్ చేసి ఆకర్షించిన మేకర్స్ తాజాగా రెండో పాట ''హే.. ఇది నేనేనా'' విడుదల చేశారు. ''అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్‌కి అమృత‌ని చూసాక ఏమైంది ???'' అనే కాన్సెప్ట్‌తో సాగిపోతున్న ఈ సాంగ్, థమన్ అందించిన బీట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Also Read: సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు రఘరాం అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. థమన్ బాణీలు మ్యూజిక్ ప్రియులకు కొత్త ఫీల్ తీసుకొచ్చాయి. ఈ సాంగ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్.. ''అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట...ఈ పాట..'' అని పేర్కొన్నారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


By August 26, 2020 at 10:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hey-idi-nenena-lyrical-song-released-from-solo-brathuke-so-better/articleshow/77756275.cms

No comments