వివాహితపై కాలేజీలోనే అఘాయిత్యం.. వీడియో తీసి కామాంధుల బ్లాక్‌మెయిల్

తమతో పాటు పనిచేస్తున్న మహిళపై కన్నేసిన ఇద్దరు కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ దారుణాన్ని వీడియో తీసి ఆమెను బెదిరిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా కంధ్లా పట్టనంలో వెలుగులోకి వచ్చింది. కంధ్లా పట్టణానికి చెందిన వివాహిత ఓ ఇంటర్ కాలేజీలో పనిచేస్తోంది. ఇటీవల ఓ రోజు పని ఎక్కువగా ఉండటంతో ఆమె రాత్రి వరకు ఆఫీసులోనే ఉంది. Also Read: దీంతో అక్కడే పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఆమెను బెదిరించి కాలేజీలోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని సెల్‌ఫోన్లో వీడియో తీశారు. ఈ విషయం బయటకు చెబితే దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తామని బెదిరించారు. అయితే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ఇద్దరు కామాంధులు బాధితురాలిని తరుచూ వేధిస్తున్నారు. తమ కోరికను తీర్చాలంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. Also Read: దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చేయడమే కాకుండా వీడియోతో తనను నిందితులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. విద్యార్థులకు పాఠాలు చెప్పే కాలేజీలోనే ఇలాంటి దారునం జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read:
By August 23, 2020 at 11:43AM
No comments