Breaking News

అబార్షన్‌కి ఒప్పుకోని యువతి... గొంతు నులిమి చంపేసిన ప్రియుడు


వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కాకుండానే ఒకే గదిలో కలిసి ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శారీరకంగా దగ్గర కావడంతో యువతి గర్భం దాల్చింది. ఆ బిడ్డకు తండ్రి కావడం ఇష్టం లేని ప్రియుడు అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నగరంలో వెలుగులోకి వచ్చింది. Also Read: పుణెకు చెందిన రంజన్‌వావ్‌కు చెందిన కిరణ్ ఫండే అనే వ్యక్తి ఓ యువతి(24)తో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ శారీరకంగా కలుస్తుండటంతో ఇటీవల ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ చేయించుకోవాలని ప్రియుడు కోరగా ఆమె నిరాకరించింది. దీనిపైనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం మరోసారి గొడవ జరగడంతో కిరణ్ కోపోద్రిక్తుడై ప్రియురాలి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By August 17, 2020 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pregnant-woman-brutally-murdered-in-pune-maharastra/articleshow/77583941.cms

No comments