Breaking News

యూట్యూబ్‌లో చూసి ఇళ్లకు కన్నాలు.. విశాఖలో చిక్కిన ఎంబీఏ పట్టభద్రుడు


ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదన్న కసితో దొంగగా మారిన యువకుడి ఉదంతమిది. వ్యసనాల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక చోరీలనే వృత్తిగా చేసుకున్నాడు. దొంగతనాలు ఎలా చేస్తారో యూట్యూబ్‌లో చూసి అందులో రాటుదేలిపోయాడు. విశాఖలోని గాజువాక ప్రాంతంలో ఏడుచోట్ల చోరీలు చేసి పోలీసులకు సవాల్ విసిరాడు. అతడిపై గట్టి నిఘాపెట్టిన పోలీసులు చివరికి అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసు వివరాలను క్రైం డీసీపీ వి.సురేష్‌బాబు గాజువాక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. Also Read: పశ్చిమ గోదావరి జిల్లా దరి కాళ్లకూరు గ్రామానికి చెందిన ఎన్‌. వినోద్‌రాజు(26) ఎంబీఏ చదివాడు. సరైన ఉద్యోగం రాకపోవడంతో ఖాళీగా ఉంటూనే జల్సాల కోసం స్నేహితులు, బంధువుల వద్ద సుమారు రూ.7 లక్షల వరకూ అప్పులు చేశాడు. గాజువాకలో ఉండే ఫ్రెండ్ ద్వారా ఓ గదిని అద్దెకు తీసుకుని సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలో గూగుల్‌లో వెతకడం ప్రారంభించాడు. ఇంటి తాళాలు ఎలా పగులగొట్టాలో యూట్యూబ్‌లో చూసి అందుకు అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకున్నాడు. గతేడాది అక్టోబరు 1న కలెక్టరేట్‌ ఉద్యోగి ఇంట్లో 5 తులాల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి వస్తువులు, ఒక కెమెరాను దొంగిలించాడు. Also Read: కొద్దిరోజుల తర్వాత అదే వీధిలోని ఓ బీమా సంస్థ, మరో కంప్యూటర్‌ శిక్షణ, డిజిటల్‌ ఫ్లెక్సీల తయారీ కేంద్రాల్లో పది కంప్యూటర్‌ మానిటర్లు, 8 సీపీయూలు, ఒక స్కానర్‌, హోండా యాక్టివా స్కూటీని ఎత్తుకెళ్లి భీమవరంలో తెలిసిన వ్యక్తులకు విక్రయించాడు. ఇలా గాజువాక ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడటంతో బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో క్రైం బ్రాంచ్ ఏసీపీ సీహెచ్‌ పెంటారావు, సౌత్‌ ఏసీపీ రామాంజనేయులు రెడ్డి, గాజువాక క్రైం సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకునిరిమాండ్‌కి తరలించారు. Also Read:


By August 24, 2020 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mba-graduate-arrested-in-vizag-city-for-doing-thefts-in-houses/articleshow/77712602.cms

No comments