ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురి హత్య... బావిలో తేలిన శవాలు

ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురు దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో కలకలం రేపింది. సమీపంలోని సూత్తమల్లిలో చాలా మంది నివాసముంటున్నారు. గురువారం భవాని, అనుష్య అనే హిజ్రాలతో పాటు అనుష్క భర్త మురుగన్ కనిపించకుండా పోయారు. మిగిలిన హిజ్రాలు వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఆ ప్రాంతంలో గాలించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో పాళయంకోట ఫోర్ వే రోడ్డు సమీపంలోని బావి వద్ద గాలించగా ముగ్గురి శవాలు గోనె సంచుల్లో తేలుతూ కనిపించాయి. దీంతో పోలీసులు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమావారిని దారుణంగా చంపేసిన హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ హిజ్రాలు శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. Also Read:
By August 23, 2020 at 07:44AM
No comments