Breaking News

దొంగగా మారిన డిగ్రీ స్టూడెంట్... టీచర్‌ ఇంట్లో బంగారు నగలు చోరీ


జిల్లా పట్టణం నాయుడుకాలనీలో జులై 27వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు, ఇతర వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నాయుడుకాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు బిడ్డిక ఆశాజ్యోతి, ఉదయకుమార్‌ ఇంటిలో గత నెల 27న చోరీ జరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామం కురుపాం వెళ్లిన వారు 31న ఇంటికి వచ్చి చూడగా బీరువా తాళాలు తీసి ఉన్నాయి. 14 తులాల బంగారు ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: విచారణలో భాగంగా వారింటి పక్కనే ఉండే డిగ్రీ విద్యార్థి గొట్టిపల్లి దినేష్‌కుమార్‌ను విచారించగా అసలు నిజం బయటపడింది. దినేష్ తాహతుకు మించి ఖర్చులు చేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని విచారించేందుకు ఇంటికి వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో కానిస్టేబుళ్లు అతడిని పట్టుకుని విచారించగా తానే దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. కిచెన్ తలుపులు సరిగ్గా వేయకపోవడంతో అందులో నుంచి లోపలికి వెళ్లానని, పరుపు కింద పెట్టిన తాళాలతో బీరువా తెరిచి 14 తులాల విలువైన ఏడు గాజులు, రెండు హారాలు, ఒక గొలుసు, తులం బంగారం ముక్క, వెండి గ్లాసులు దొంగిలించాడు. Also Read: అనంతరం శ్రీకాకుళం జిల్లా పిన్నింటిపేటకు చెందిన తన ఫ్రెండ్ ఆనందరావును దినేష్ సంప్రదించాడు. ఇద్దరూ కలిసి ఆ వస్తువులు అమ్మేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. ఈలోగా దినేష్‌కుమార్‌ తన తల్లికి ఒంట్లో బాగాలేదని చెప్పి బొబ్బిలిలో మూడు గాజులను అమ్మేశాడు. గత నెల 29న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మరో మూడు గాజులు, బంగారం ముక్కను అమ్మేశాడు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించడంతో పోలీసులు దినేష్‌తో పాటు అతడి ఫ్రెండ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By August 05, 2020 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bobbili-police-arrests-degree-student-over-he-accused-of-robbery-case/articleshow/77364642.cms

No comments