Breaking News

హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్ట్‌లతో లాడ్జీలో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్


నగరంలో మరో వ్యభిచార ముఠా పోలీసులకు చిక్కింది. గుట్టుచప్పుడు కాకుండా లాడ్జిలో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను జీడిమెట్ల పోలీసులు బట్టబయలు చేశారు. లాడ్జి నిర్వాహకుడితో పాటు నలుగురు సెక్స్‌వర్కర్లు, నలుగురు విటులను అరెస్ట్ చేశారు. సెక్స్‌వర్కర్లతో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉండటం గమనార్హం. జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షాపూర్ నగర్‌లో సత్యనారాయణ అలియాస్ రాజేష్‌ అనే వ్యక్తి రాఘవేంద్ర లాడ్జిని నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా లాడ్జి మూసివేయడంతో నష్టాల పాలయ్యాడు. దీంతో అప్పులన్నీ తీర్చేసి ఆర్థికంగా స్థిరపడేందుకు వ్యభిచారం చేయించాల ని నిర్ణయించుకున్నాడు. Also Read: జూనియర్ ఆర్టిస్టులైన షేక్ హసీనా, షేక్ షభానాలతో పాటు మరో ఇద్దరు యువతులను తీసుకొచ్చి తన లాడ్జినే వ్యభిచార కేంద్రంగా మార్చేశాడు. విటులను ఆకర్షించి కొంతకాలంగా నలుగురు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు మంగళవారం రాత్రి లాడ్జిపై దాడి చేశారు. ఆ సమయంలో నాలుగు గదుల్లో నలుగురు సెక్స్‌వర్కర్లతో విటులు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. లోపలికి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ముందుగా లాడ్జి ఓనర్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. Also Read: గదుల్లో ఏకాంతంగా ఉన్న నాలుగు జంటలను బయటికి రప్పించి అరెస్ట్ చేశారు. అరెస్టయిన విటులను దనం సంపత్, ఒగ్గు ఓబిలాష్, మేరుగు సురేష్, నర్రా రాజ్‌కుమార్‌లుగా గుర్తించారు. వీరిలో రాజ్‌కుమార్ వీఆర్‌ఓగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లాక్‌డౌన్ కారణంగా ఎదురైన నష్టాలను పూడ్చుకునేందుకు లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్నట్లు యజమాని సత్యనారాయణ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. Also Read:


By August 27, 2020 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-running-in-lodge-in-hyderabad-9-arrested/articleshow/77775108.cms

No comments