Breaking News

ఐదు నెలల తర్వాత తెరుచుకున్న కేరళ పద్మనాభస్వామి ఆలయం.. రోజుకు 665 మందికే అనుమతి


కేరళలోని ప్రఖ్యాత బుధవారం నుంచి భక్తులను దర్శనం కోసం అనుమతించనున్నారు. కొవిడ్‌-19 కారణంగా మార్చి 21 నుంచి దర్శనాలను నిలిపివేయగా.. ఐదు నెలల అనంతరంం నేడు ప్రారంభించారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకునేలా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. రోజులో గరిష్ఠంగా 665 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 8.00 నుంచి 11.00 గంటల వరకు, సాయంత్రం 5.00 గంటల నుంచి 8.30 గంటలకు దీపారాధనతో దర్శనం నిలిపివేస్తారు. అంతరాలయంలో కేవలం 35 మందిని అనుమతిస్తారు. దేశంలో ఆలయాలు, ప్రార్ధనా మందిరాలను జూన్ 8 నుంచి తెరవడానికి కేంద్ర హోం శాఖ అనుమతించినా.. కేరళ ప్రభుత్వం మాత్రం అనంత పద్మనాభస్వామి ఆలయంలో దర్శనాలకు అనుమతించలేదు. తిరువనంతపురంలో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదుకావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దర్శనం కోసం వెళ్లే భక్తులు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్కులు ధరించడం లాంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలి. పదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయాల్లోకి అనుమతించరు. చెప్పులు విడిచే ప్రాంతంలోనే నీళ్లు, సబ్బు, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతి ఇస్తారు. భక్తులకు తీర్థం, ప్రసాదం లాంటివేం ఇవ్వరు. శఠగోపం కూడా పెట్టరు.


By August 26, 2020 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sree-padmanabhaswamy-temple-in-kerala-to-open-doors-for-devotees-from-today/articleshow/77754651.cms

No comments