Breaking News

కామ్‌డెక్ పరీక్షకు హాజరైనవారిలో 57 మంది కోవిడ్‌తో చనిపోయారా? ఇందులో నిజమెంత?


ఇంజినీరింగ్, మెడికల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్, పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహించడమంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా... ఆగస్టు 19న కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజినీరింగ్, డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామ్‌డెక్) ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 57 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయినట్టు కాంగ్రెస్ నేత ఇటీవల ట్వీట్ చేశారు. కామ్‌డెక్ ప్రవేశ పరీక్షకు హాజరైనవారిలో 5,371 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, మరో 8,456 మంది క్వారంటైన్‌లో ఉన్నారని పేర్కొంటూ నీట్, జేఈఈలను వాయిదా వేయాలని కోరుతూ పలు హ్యాష్‌టాగ్‌లను పోస్ట్ చేశారు. దీనిపై న్యూస్ 18 ఓ ఆర్టికల్ రాసినట్టు కొన్ని స్క్రీన్ షాట్‌లను జతచేశారు. ‘COMDEK UGET 2020: 57 deaths With 5371 students +ve for Covid 19 , 8456 students qurantined’ టైటిల్‌తో ఈ న్యూస్‌ను సదరు వెబ్‌సైట్ ప్రచురించినట్టు పేర్కొన్నారు. కామ్‌డెక్ యూజీ నెట్‌కు హాజరైన విద్యార్థులలో చాలా మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరి కారణంగా 57 మంది చనిపోయారని తెలిపాయి. ఈ ట్వీట్‌ను పలువురు షేర్ చేస్తూ, నీట్, జేఈఈ వాయిదా వేయాలని ట్వీట్‌లు పెట్టారు. అయితే, ఈ వార్తల్లో నిజం లేదు. అటువంటి ఆర్టికల్‌ను న్యూస్ 18 ప్రచురించలేదు. అల్కా లంబా, ఇతర నెటిజన్లు ట్విట్టర్‌లో చేస్తున్నది తప్పుడు ప్రచారం. వెరిఫికేషన్, మెథడాలజీ న్యూస్ 18 స్క్రీన్‌ షాట్లను నిశితంగా పరిశీలించినప్పుడు, దానిలో అనేక వ్యాకరణ దోషాలు, తప్పులు ఉన్నట్టు గుర్తించారు. ఉదాహరణకు COMEDKను COMDEK అని తప్పుగా రాశారు. క్వారంటైన్ కూడా 'qurantined' అని తప్పుగా రాశారు. కాబట్టి ఈ వార్తల్లో నిజం లేదు. అలాగే.. COMEDK UGET 2020 News18’ వంటి కీలక పదాలను ఉపయోగించి, 2020 ఆగస్టు 20 న న్యూస్ 18 వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఆర్టికల్‌ను గుర్తించాం. రెండింటినీ పరిశీలించి, పరీక్ష తర్వాత కోవిడ్ -19 కారణంగా విద్యార్థులు చనిపోయారని తప్పుడు ప్రచారం చేయడానికి మార్పులు చేసినట్టు తేలింది. వెర్డిక్ డిజిటల్ ఎడిట్ న్యూస్ ద్వారా కాంగ్రెస్ నేత అల్కా లంబా చేసిన ట్వీట్ తప్పని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది.


By August 28, 2020 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/fake-alert-alka-lamba-falsely-claims-57-students-died-due-to-covid-19-post-comedk-exam/articleshow/77798221.cms

No comments