హైదరాబాద్: తుపాకీతో బెదిరించి వ్యాపారి కిడ్నాప్.. రూ.4కోట్లు డిమాండ్

హైదరాబాద్ వ్యాపారిక కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. తుపాకీతో బెదిరించి ఓ కెమికల్ వ్యాపారిని అపహరించిన దుండగులు ఆయన వద్ద నుంచి ఆశించినంత డబ్బులు రాకపోవడంతో విడిచిపెట్టి పరారయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన ఎస్.రామకృష్ణంరాజు గుండ్లపోచంపల్లి శివారు ఊర్జిత గ్రాండ్ విల్లాస్‌లో నివసిస్తూ నాచారంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. Also Read: ఈ నెల 27వ తేదీ ఉదయం కారులో కంపెనీకి వెళ్తున్న ఆయన్ని కొంపల్లి అండర్‌పాస్ సమీపంలో ఆరుగురు వ్యక్తులు అడ్డగించి తుపాకీతో బెదిరించి కళ్లకు గంతలు కట్టి కారులో కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రూ.4 కోట్లు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించారు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని, రూ.2లక్షల వరకు సమకూరుస్తానని బాధితుడు చెప్పడంతో తీవ్రంగా కొట్టారు. తనను చంపేసినా రూ.2లక్షలకు మించి లేవని చెప్పడంతో చేసేదేమీ లేక మధ్యాహ్నం 3.30గంటల సమయంలో అతడిని విడిచిపెట్టి పరారయ్యారు. Also Read: అక్కడి నుంచి బాధితుడు బిక్కబిక్కుమంటూ ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన నగరంలోని వ్యాపార వర్గాల్లో భయాందోళన కలిగించింది. Also Read:
By August 30, 2020 at 07:56AM
No comments