Breaking News

అమెరికా: వీసా మోసాలతో 21 మిలియన్ డాలర్లు పోగేసిన భారతీయుడు.. ఎట్టకేలకు అరెస్ట్!


వీసా మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఓ భారతీయుడ్ని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. మోసపూరితంగా పొందిన హెచ్ -1 బి వీసాల సాయంతో విదేశీ పౌరులను అమెరికాకు రప్పించినట్టు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం వెల్లడించారు. గురువారం అరెస్టు చేసిన 48 ఏళ్ల హెచ్ -1 బి వర్క్ వీసాల కోసం దరఖాస్తులను అందజేయడానికి నాలుగు కార్పొరేషన్లను ఉపయోగించారని ఆరోపించారు. ఆశిష్‌పై కుట్ర, వాణిజ్య ప్రయోజనం లేదా వ్యక్తిగత లాభం కోసం విదేశీయుడిని అమెరికాలోకి వచ్చి నివసించడానికి ప్రేరేపించడం, మోసపూరిత అభియోగాలు నమోదుచేశారు. వీసా మోసాలకు పాల్పడిన సాహ్నీ 2011 నుంచి 2016 వరకు దాదాపు 21 మిలియన్ డాలర్లు సంపాదించినట్టు ప్రాసిక్యూటర్లు వివరించారు. ఈ కేసులో ఆశిష్ సాహ్నీ దోషిగా నిర్ధారణ అయితే పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. వాషింగ్టన్ డీసీ శివారు వర్జానీయాలోని స్టెర్లింగ్‌లో నివాసం ఉంటున్న ఆశిష్.. విదేశీ కార్మికులు ఒక నిర్దిష్ట ఉద్యోగం కోసం అమెరికాకు వస్తున్నట్టు పేర్కొంటూ దరఖాస్తులు సమర్పించాడని, వాస్తవానికి, దాఖలు చేసే సమయంలో ఎటువంటి ఉద్యోగం పొందలేదని ప్రాసిక్యూటర్లు చెప్పారు. తప్పుడు ఆధారాలు, పత్రాలతో కూడిన దరఖాస్తులను సమర్పించడం ద్వారా సాహ్నీ సహజంగా అమెరికా పౌరుడిగా ఉండటానికి ప్రయత్నించినట్టు తెలిపారు.


By August 22, 2020 at 01:09PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/indian-national-has-been-arrested-on-charges-of-conspiracy-to-commit-visa-fraud-in-us/articleshow/77689745.cms

No comments