Breaking News

ప్రభాస్ 21లో దీపికాతో పాటు మరో భామ..?


రాధేశ్యామ్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్, తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ తో ఒప్పుకున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకునే నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు.

టైమ్ ట్రావెలర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోందని నాగ్ అశ్విన్ ఇంతకుముందే వెల్లడించాడు. అయితే ఈ సినిమాలో దీపికాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉందట. సెకండ్ హీరోయిన్ ని దక్షిణాది నుండి తీసుకునే అవకాశాలు ఉన్నాయట. సెకండ్ హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని అంటున్నారు. సినిమాలోని కీలక మలుపునకు సెకండ్ హీరోయిన్ కారణమవుతుందని చెబుతున్నారు.

అందువల్ల ఆ పాత్రలో చేయడానికి అందరికీ తెలిసిన హీరోయిన్ నే తీసుకోవాలని చూస్తున్నారట. అంతే కాదు ఆ హీరోయిన్ తో ప్రభాస్ స్టెప్పులు కూడా వేస్తాడట. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఎవరికి దక్కుతుందో చూడాలి. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది నుండి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2022లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.



By August 01, 2020 at 05:51PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/52054/prabhas.html

No comments