Breaking News

నగల దుకాణంలో 14 కిలోల బంగారం చోరీ.. ఉద్యోగులపైనే అనుమానం


రాజధాని నగరంలోని ఓ జ్యువెల్లరీ షాపులో 14 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. షావుకారుపేట ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డులో రాజ్‌కుమార్‌ (47), సుభాష్‌ బోత్ర (37) అనే ఇద్దరు మిత్రలు కలిసి 20ఏళ్లుగా బంగారం దుకాణాన్ని నడుపుతున్నారు. నగలను డిజైన్‌ చేసి చిన్న వ్యాపారులకు విక్రయించేవారు. వారంలో మంగళ, శుక్రవారాల్లో మాత్రమే దుకాణం తెరుస్తుంటారు. Also Read: ఈ క్రమంలోనే గత శుక్రవారం 14 కిలోల బంగారాన్ని దుకాణంలోని లాకర్‌లో పెట్టారు. మంగళవారం దుకాణం తెరిచి చూడగా లాకర్‌లో బంగారం కనిపించలేదు. దీంతో వారు వెంటనే ఎలిఫెంట్‌గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దుకాణానికి చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణం తలుపులు వేసినట్లే ఉండటం, లాకర్‌ను పగలగొట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో దుండగులు నకిలీ తాళాలు ఉపయోగించి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. Also Read: సీసీ కెమెరాల్లో సైతం చోరీకి సంబంధించి ఎలా ఆధారాలు రికార్డు కాలేదు. దీంతో దుకాణం పనిచేసే సిబ్బందే చోరీకి పాల్పడ్డారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By August 27, 2020 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/14-kgs-gold-ornaments-stolen-from-jewellery-shop-in-chennai/articleshow/77776059.cms

No comments