నిజామాబాద్‌లో కీచక పర్వం.. అర్థరాత్రి మహిళపై 12 మంది గ్యాంగ్ రేప్

జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. కలెక్టరేట్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఓ మహిళపై 12 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ్డుప్రమాదంలో గాయపడింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో బాధితురాలికి తోడుగా సోదరి ఆస్పత్రిలో ఉంది. సోమవారం రాత్రివేళ ఏదో పని నిమిత్తం నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోకి వెళ్లింది. Also Read: ఆమెను గమనించిన విక్కీ అనే యువకుడు మాటలు కలిపాడు. ఈ క్రమంలోనే తన సోదరి చికిత్స కోసం డబ్బు అవసరం ఉందని మహిళ చెప్పింది. దీంతో ఆ డబ్బు తాను ఇస్తానని నమ్మబలికిన విక్కీ ఆమెను కలెక్టరేట్ సమీపంలోని ధర్నాచౌక్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రెవెన్యూ భవన్‌లోని ఓ ఖాళీ గదిలోకి ఆమెను తీసుకెళ్లి బెదిరించి నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు ఫోన్ చెప్పడంతో 11 మంది యువకులు అక్కడికి చేరుకుని ఒకరి తర్వాత ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. Also Read: అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటుగా రావడాన్ని గమనించిన నిందితులు అక్కడికి నుంచి పరారయ్యారు. నిస్సహాయ స్థితిలో వున్న బాధితురాలిని పోలీసులు ప్రశ్నించగా తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో పోలీసులు ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు విక్కీ హమాల్‌వాడీకి చెందిన వాడుగా గుర్తించారు. అతడు పెయింటింగ్ పనులు చేస్తుంటాడని, అతడితో పాటు మొత్తం 8 మంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. నిందితుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. Also Read:
By August 26, 2020 at 07:13AM
No comments