Breaking News

RRR హీరోయిన్‌కు బెదిరింపులు.. రేప్ చేస్తామని వార్నింగ్


బాలీవుడ్ యువ హీరో అనేకమంది సినీ ప్రముఖుల్ని వెంటాడుతూనే ఉంది. అతడు మరణించి నెలరోజులు కావస్తున్నా.. ఆ మృతికి సంబంధించిన వార్తలు మాత్రం బాలీవుడ్ సెలబ్రిటీల్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. సోషల్ మీడియాలో సుశాంత్ మృతితో బాలీవుడ్ నెపోటిజంపై విమర్శలు గప్పుమన్న విషయం తెలిసిందే. అనేకమంది సెలబ్రిటీలపై నెటిజన్లు ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా గతంలో సుశాంత్ పై చేసిన కామెంట్లు కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Read More: దీంతో సుశాంత్ మృతి వెనుక ఆలియా భట్ ప్రమేయం కూడా ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోన్న నేపథ్యంలో ఆలియా భట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా నెటిజన్లలో కొందరు ఆమెపై బెదిరింపులకు దిగారు. వీటిపై సైలెంట్ గా ఉన్నా ఆమె సోదరి షహీన్ భట్ మాత్రం ఊరుకోలేదు. ఆ బెదిరింపులుకు చెందిన స్క్రీన్ షాట్స్ తీసి ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ చేసింది. వారిపై లీగల్ గా కేసులు పెడతామని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియాలో ఆలియా భట్‌కు ఫాలోవర్ భారీగా తగ్గిపోయారు. భారీ ఫాలోయింగ్ ఉన్న ఆలియా భట్‌కు నెటిజన్లు షాక్ ఇచ్చారు. సుశాంత్ మృతి తర్వాత ఆమెను దాదాపు 5 లక్షల మంది అన్ ఫాలో చేశారు. ఆలియా తెలుగులో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లో ఇప్పట్లో పాల్గొనలేననని ఆలియా చెప్పేసింది. మరోవైపు బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సంజయ్ లీలా చిత్రంలో ఆలియా లీడ్ పాత్ర చేస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వంలో “గంగు భాయ్ కతియవాది” అనే రియల్ లైఫ్ బయో పిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన నిలిచిపోయింది. ఈ సినిమాను ముంబయి రెడ్ లైట్ ఏరియాలో కామాటిపురాకు సంబంధించిన కథతో తెరకెక్కిస్తున్నారు.


By July 15, 2020 at 10:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/alia-bhatt-receive-threats-on-the-social-platform/articleshow/76972466.cms

No comments