Breaking News

Rgv: అమ్మాయిలను వాడుకున్నారట కదా! యాంకర్ అడగ్గానే రామ్ గోపాల్ వర్మ ఫీలింగ్స్.. మైకు తీసేసి!!


గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్ అవుతున్నారు వివాదాస్పద డైరెక్టర్ . కరోనా విలయతాండవాన్ని మించి తనకే వార్తల్లో స్పేస్ ఉండేలా వరుస సంచలనాలు సృష్టిస్తున్నారు ఆర్జీవీ. లాక్‌డౌన్ వేళ అడల్ట్ సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని లాగేస్తూ తనదైన దారిలో వెళ్తున్న ఈ విలక్షణ దర్శకుడు.. ఇటీవలే పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా '' సినిమా తీసి పలు చర్చలకు తెరలేపారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్న వర్మ.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు చిర్రెత్తిపోతూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. పవర్ స్టార్ సినిమాతో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న హంగామాకు కళ్లెం వేసేలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతన్ని రిటర్న్ టార్గెట్ చేశారు. మీకే కాదు మాకు కూడా లాజిక్స్ తెలుసు అంటూ ఆర్జీవీ రియల్ క్యారెక్టర్ బయటపెట్టేశారు. 'పవర్ స్టార్'కి పోటీగా 'పరాన్నజీవి' సినిమాను రూపొందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ పరాన్నజీవి సినిమాలో ఆర్జీవి వాల్యూ తగ్గించే సీన్స్ పెట్టేశారు. ఇందులో అవకాశం ఇస్తానని చెప్పి అమ్మాయిలను వాడుకుంటారనే విధంగా కొన్ని సన్నివేశాలు చూపించారు. Also Read: ఈ క్రమంలోనే లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇదే విషయమై వర్మకు ఓ ప్రశ్న ఎదురైంది. అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారని, వాడుకుంటారనే ఆరోపణలు మీపై ఉన్నాయి. ఎంతవరకు నిజం? ఆర్జీవీ గారు అని యాంకర్ ప్రశ్నించడంతో కోపంతో ఊగిపోతూ రియాక్ట్ అయ్యారు వర్మ. ''అసలు ఆ విషయం ఎవరు చెప్పారు మీకు? రోడ్డుమీద ఎవడో ఏదో అనుకుంటే నమ్మేస్తారా?. పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి నువ్వెవరు?'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా పర్సనల్ లైఫ్ నా సెక్స్ లైఫ్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు కాదు ఇక్కడికి వచ్చింది. పవర్ స్టార్ సినిమా గురించి అడుగుతా అన్నారు అడగండి. పర్సనల్ విషయాల జోలికి వెళ్లొద్దు. అయినా ఏ అమ్మాయైనా వచ్చి నీతో చెప్పిందా ఆర్జీవీ నా జీవితం నాశనం చేశాడని? అయితే నేను చెప్పాలి.. లేదా ఓ అమ్మాయి చెప్పాలి. కానీ మీరేంటి ఈ ప్రశ్నలు వేయడం.. స్మార్ట్‌గా యాక్ట్ చేయకండి’’ అంటూ యాంకర్‌పై ఫైర్ అయ్యారు వర్మ. ఆ వెంటనే మైకు తీసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


By July 27, 2020 at 11:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-gets-angry-with-anchor-question-in-latest-interview/articleshow/77192462.cms

No comments