Breaking News

Rgv: పవర్ స్టార్ పేరుతో వర్మ కొత్త బిజినెస్!! మనోడి ఐడియాకి అవార్డు ఇవ్వాల్సిందే.. షాకింగ్ అప్‌డేట్


సంచలనాలకు కేంద్రబిందువుగా ఉంటూ ఎప్పుడూ జనం నోళ్ళలో నానుతూ వస్తున్న .. ఈ కరోనా కాలాన్ని తనకు అనువుగా మార్చేసుకున్నారు. సినిమా వాళ్లంతా మాకు పనిలేదు, పైసా రాకడ లేదు మొర్రో అని మొత్తుకుంటుంటే.. వర్మ మాత్రం ఎంచక్కా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సరికొత్త ఆలోచనలతో వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికే ''క్లైమాక్, నగ్నం'' సినిమాలతో జనం ఖాతాల్లో ఉన్న సొమ్మును తన ఖాతాకు వారి చేతనే డైవర్ట్ చేయించుకున్న ఆయన తాజాగా ‘’ పేరుతో మరో భారీ బిజినెస్ ప్లాన్ చేశారని తెలుస్తుండటంతో ట్రేడ్ వర్గాలు సైతం బిత్తరపోతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడటం, ఓటీటీ వేదికలకు డిమాండ్ పెరగడం గమనించిన వర్మ.. తన ఆలోచనలకు పదును పెడుతూ ఆన్‌లైన్ వేదికలపై వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. షూటింగ్ మొదలుకొని విడుదల వరకు ఒక్కరూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టకుండా ప్రమోషన్స్ పని కూడా తానే స్వయంగా చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ మూవీ 'పవర్ స్టార్' విషయమై బడా దర్శకనిర్మాతలు సైతం షాకయ్యేలా కొత్త స్ట్రాటజీ అమలు చేయబోతున్నారట వర్మ. పవన్ కళ్యాణ్ జీవిత కథ కాదంటూనే అచ్చం పవన్ లాంటి యాక్టర్‌ని పెట్టి 'పవర్ స్టార్' పేరుతో మూవీ రూపొందిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి జనం దృష్టాంతా తన మూవీపైనే ఉండేలా చూసుకున్నారు. ఇక ఇప్పుడు ఆ 'పవర్ స్టార్' క్రేజ్‌ని విడుదలకు ముందే క్యాష్ చేసుకునేలా ఆయన సరికొత్త ప్రణాళిక రచించారని తెలిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమా ట్రైలర్‌ని కూడా డబ్బులు చెల్లిస్తేనే చూపించబోతున్నారట ఈ డిఫెరెంట్ డైరెక్టర్. Also Read: పైగా 'పవర్ స్టార్' స్టామినా అలాంటిది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నారట వర్మ. ఈ మేరకు పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే ఒక్కో వ్యూ కోసం 10 రూపాయలు చెల్లించాలని, ఆ దిశగా ప్రస్తుతం వర్మ అడుగులు పడుతున్నాయని ఫిలిం నగర్ టాక్. ఒకవేళ ఇదే జరిగితే సినిమా ప్రమోషన్‌గా చెప్పుకునే ట్రైలర్‌కి కూడా డబ్బులు వసూలు చేసిన ఏకైక వ్యక్తి వర్మనే అవుతాడు. ఏదేమైనా మనోడి కొత్త బిజినెస్ ఐడియాలు చూసి షాక్ అవుతున్న జనం.. ఈ విషయంలో వర్మకు అవార్డు ఇవ్వాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.


By July 17, 2020 at 10:37AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-new-and-shocking-business-strategy-for-power-star-movie/articleshow/77012414.cms

No comments