Rashmi Gautam: మా ఇద్దరికీ పెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన సుడిగాలి సుధీర్, పక్కనే రష్మి!
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్‌లో ప్రభాస్ ఫస్ట్ ఉన్నట్టే.. బుల్లితెరపై సుడిగాలి స్థానం కూడా అదే. ఆయన ఎక్కడ కనిపించినా.. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నతో పాటు రష్మిని పెళ్లి చేసుకుంటున్నారా? లేదా? అనే ప్రశ్న కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండటంతో ఈ పెళ్లి గోల ఎక్కువైదంటూ తల పట్టుకుంటున్నాడు సుధీర్. ఇంట్లో పేరెంట్స్ మాత్రమే కాకుండా.. మా అక్క కూడా పెళ్లి పెళ్లి అని గోల చేసింది. ఆఖరుకి మా అక్క వాళ్ళ పాపతో కూడా పెళ్లి చేసుకోమని చెప్పించారు.. మేం ఇండియా రావాలంటే పెళ్లి చేసుకో అప్పుడే వస్తాం అని కండిషన్ కూడా పెట్టారు’ అంటూ తన పెళ్లి పాట్లు గురించి చెప్తున్నాడు సుడిగాలి సుధీర్. తన జోడీ రష్మితో కలిసి అలీతో సరదాగా కార్యాక్రమానికి వచ్చారు సుధీర్. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు వైరల్ అవుతుండగా.. తాజా ప్రోమోలో తన పెళ్లిపైనే ఫోకస్ పెట్టాడు సుధీర్. మొదటిగా గురించి అలీ చాలా లోతుగా అడిగే ప్రయత్నం చేశారు. దీనికి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు సుధీర్. రష్మి అందానికి ఎన్నిమార్కులు అంటే.. వెయ్యి వేశాడు. స్టుపిడిటీకి రెండు వేలు.. మార్కులు వేశాడు. దీనికి అరేయ్.. రెచ్చిపోకు అనవసరంగా అంటూ చాలా క్యూట్‌గా చెప్పింది రష్మి. రష్మితో.. ఒకటి రాఖీ, రెండు తాళి, ఈ రెండింటిలో ఏది ప్రిఫర్ చేస్తావ్ అంటే.. రాఖీనే అని సమాధానం ఇచ్చాడు సుధీర్. దానికి రష్మి.. రాఖీలా తాళి కట్టలేం కదా అని సుధీర్‌ని ఇరుకున పెట్టే ఆన్సర్ ఇచ్చింది. ఇక రష్మి ఇంట్లో సుధీర్ పెళ్లి చూపులు కాన్సెప్ట్ పేలింది. అలీ, సుధీర్, రష్మిలు అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇందులో రష్మి పెళ్లి చూపుల్లోనే పాలగ్లాసుతో వచ్చిన రష్మి పెర్ఫామెన్స్ పీక్స్‌కి వెళ్లింది. ఇందులో రష్మికి మామగా అలీ వ్యవహరించగా.. వెంకట లక్షి అనే రోల్‌లో రష్మి చేసింది. ఇక క్యారెక్టర్స్‌లోకి దిగిన అలీ, రష్మి, సుధీర్‌లు పెళ్లి చూపులు స్కిట్‌ను ఇరగదీశారు. మొదటిగా రష్మిని వెంకటలక్షీ అని అలీ పిలవగా.. రష్మి గ్లాస్ పట్టుకుని వయ్యారంగా నడుస్తూ.. సుధీర్‌ని చూసి హూ!! అనడం.. దానికి సుధీర్ తెగ సిగ్గుపడిపోవడం ఫుల్ ఫన్ జనరేట్ అయ్యింది. ఇక రష్మి తెగ సిగ్గు పడిపోవడంతో అమ్మా.. ఇది పెళ్లి చూపులు, శోభనం కాదంటూ అలీ పంచ్ వేశాడు. పెళ్లి చూపులకు పిలిస్తే.. ఆమె ఏకంగా పాలగ్లాస్‌తో శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చింది అంటూ అలీ వరుస పంచ్‌లు వేశాడు. దీనికి సుధీర్ పడిపడి నవ్వగా.. రష్మి మరింత సిగ్గుపడింది. ఇక ఈ మూడు నెలల్లో పెళ్లి గురించి ఆలోచించావా సుధీర్ అని అలీ.. సుధీర్‌ను అడగడంతో తన కష్టాలు చెప్పుకొస్తూ.. చివర్లో మా ఇద్దరికీ పెళ్లి చేశారు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు సుధీర్. అతని మాటలకు అలీతో పాటు రష్మి కూడా షాక్ అయ్యింది. మరి ఆ పెళ్లి ఏంటి?? ఇంతకీ సుధీర్‌కి ఎవరితో పెళ్లి చేశారో తెలియాలంటే ‘అలీతో సరదాగా’ పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. Video Courtesy Gnapika Entertainments Private Limited
By July 13, 2020 at 11:16AM
No comments