KTR Birth Day: డియర్ తారక్ అంటూ చిరంజీవి సందేశం.. వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్
నేడు (జులై 24) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ . నేటితో ఆయన 44 ఏళ్ళు పూర్తి చేసుకొని 45వ యేట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ .. కేటీఆర్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. Also Read: ''డియర్ తారక్ హ్యాపీ బర్త్ డే'' అని పేర్కొన్న చిరంజీవి సేవలను ప్రశంసించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యే తీరు ఆనందం కలిగిస్తుందని, అందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా స్వీకరించి, క్షుణ్ణంగా పరిశీలించే మీరు ఇలాగే భవిష్యత్తులో కూడా ప్రజలకు కొండంత బలంగా ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపారు చిరంజీవి. మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ చూసి మెగా వర్గాలు వెల్లువలా కేటీఆర్‌కి బర్త్ డే విషెస్ చెబుతున్నాయి. ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమా చేసి చారిత్రాత్మక సినిమా చేయాలనే తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ చేస్తున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందని సమాచారం.
By July 24, 2020 at 11:28AM
No comments