Breaking News

భద్రతా మండలిలో భారత్‌కు బాసటగా జర్మనీ, అమెరికా.. చైనాక్ షాక్!


కరాచీ స్టాక్‌ ఎక్స్ఛేంజీపై ఉగ్రదాడిని ఖండిస్తూ పత్రికా ప్రకటన రూపొందించాలని భద్రతా మండలిలో చేసిన ప్రయత్నాలను అమెరికా, జర్మనీ అడ్డుకున్నాయి. భద్రతా మండలిలో ఇలాంటి ఉగ్రదాడి ఘటనలను ఖండిస్తూ ప్రకటన జారీ చేయడం సాధారణమే. కానీ కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీపై దాడికి భారత్ కారణమని పాకిస్థాన్ ప్రధాని, విదేశాంగ మంత్రి ఆరోపించారు. దానికి చైనా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అమెరికా, జర్మనీ భారత్‌కు అండగా నిలిచాయి. ప్రతికా ప్రకటనను రూపొందించిన చైనా.. పాకిస్థాన్‌కు ప్రగాఢ సానుభూతి తెలపడంతోపాటు... అంతర్జాతీయ చట్టం ప్రకారం.. భద్రతా మండలి తీర్మానాల ప్రకారం పాకిస్థాన్ ప్రభుత్వానికి భద్రతా మండలి సభ్యదేశాలు సహకరించాలని అందులో పేర్కొంది. చైనా మంగళవారమే ఈ స్టేట్‌మెంట్‌ను భద్రతామండలిలో ప్రవేశపెట్టగా... సాయంత్రం 4 గంటల వరకు దానిపై సభ్యదేశాలు మౌనం వహించాయి. ఇంకొద్ది సేపు ఆగితే భద్రతా మండలి నిబంధనల ప్రకారం ఆ ప్రకటన ఆమోదం పొందుతుంది. కానీ సాయంత్రం 4 గంటల సమయంలో రంగంలోకి దిగిన జర్మనీ.. ఆ ప్రకటన జారీ చేయడాన్ని ఆలస్యం చేసింది. కరాచీ స్టాక్‌ ఎక్స్ఛేంజీపై ఉగ్రదాడికి భారత్ కారణమంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఎస్ఎం ఖరేషీ ప్రకటన పొరుగు దేశాన్ని నిందించేలా ఉందని, ఇది ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని తెలిపింది. జర్మనీ జోక్యం చేసుకునే సమయానికి సమయం 4 గంటలు దాటిందని చైనా నిరసన వ్యక్తం చేసింది. దీంతో డెడ్‌లైన్‌ను పొడిగించారు. ఈసారి అమెరికా రంగంలోకి దిగి ప్రకటన జారీ కాకుండా అడ్డుకుంది. చివరకు ఆ ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉందని దౌత్యవేత్తలు తెలిపారు. కానీ చైనా, పాకిస్థాన్ పట్ల ఉన్న అంతర్జాతీయంగా ఉన్న అసంతృప్తి మాత్రం బయటపడింది.


By July 02, 2020 at 12:26PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/karachi-attack-statement-germany-us-supports-india-vs-china-in-unsc/articleshow/76745538.cms

No comments