డిస్‌ప్లే, ప్రొఫైల్ పిక్స్ మార్చేసిన మహేష్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ ఏ చిన్న పనిచేసిన అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహేష్... తరచూ తనకు సంబంధించిన అనేక అప్ డేట్స్‌ను ఫ్యాన్స్‌కు అందిస్తుంటాడు. అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, పిల్లల ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. మహేష్ సతీమణి నమ్రత, కూతురు సితార కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా మహేష్ సోషల్ మీడియాలో తన ఎకౌంట్లకు సంబంధించిన డిస్ ప్లే పిక్స్ మార్చేశాడు. Read More: ఇన్నాళ్ల పాటు ఉన్న ఫోటోల్ని తీసేసి వాటి ప్లేసులో కొత్త వాటిని యాడ్ చేశాడు. తన తోటి సెలబ్రిటీలంతా తరచుగా సోషల్ మీడియా డిస్ ప్లే పిక్ లను మారుస్తూ ఉన్నా... మహేశ్ బాబు మాత్రం చాలా కాలం నుంచి ఒకటే పిక్ ను కొనసాగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, మహేశ్ కూడా తన పిక్ ను మార్చేశారు. ఇదే సమయంలో ప్రొఫైల్ పిక్ ను కూడా ఆయన మార్చేశారు. ఈ రెండూ మహేశ్ కొత్త ఫోటోలే కావడం గమనార్హం. వీటిని చూసిన ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ సంబరి పడిపోతున్నారు. మహేష్ సెంటిమెంట్స్ ను బాగా ఫాలో అవుతారు. అందుకే తన సినిమాల ప్రారంభోత్సవాలకు ఆయన కనిపించరు. గతంలో కొన్ని చిత్రాల ముహూర్తాల సమయంలో కనిపించడంతో అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన అప్పట్నుంచి తన సినిమా ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటారు. అయితే తాజాగా డిపీలను మార్చడం వెనుక కూడా ఏదో సెంటిమెంట్ ఖచ్చితంగా ఉండే ఉంటుందని పలువురు సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
By July 15, 2020 at 07:47AM
No comments