భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి.. భవిష్యత్తులో ఇంకెన్ని చూడాలో! రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన
కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 2020 ఆరంభం నుంచే కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ప్రజల ఆర్ధిక స్థితిగతులు ఛిద్రమయ్యాయి. నేటికీ కరోనా కల్లోలానికి బ్రేకులు పడకపోతుండటంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోయిన్ తాజా పరిస్థితులపై స్పందిస్తూ ప్రతి రోజూ భయం భయంగా బ్రతకాల్సిన సిచువేషన్ నెలకొందని పేర్కొంది. 2020 సంవత్సరమంతా ఇబ్బందులతోనే కొనసాగుతోందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలను నేర్పిందని చెప్పిన రకుల్.. అందరం కూడా స్వీయ రక్షణను, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దామని సూచించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని విపత్తులు, రోగాలు, యుద్దాలను చూసే అవకాశాలున్నాయని, అయినా కూడా ఎలాంటి ఆపదలు మన దరికి చేరవనే నమ్మకంతో, ధైర్యంతో జీవిద్దామని ఆమె తెలిపింది. అందరూ ఇంటి వద్దనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమి కొట్టాలని ఆమె కోరింది. Also Read: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో రకుల్ హంగామా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది 'మన్మథుడు 2' సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న ఆమె.. తాజాగా దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ ఓకే చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో కథ వినగానే ఆమె రెడీ అనేసిందట. ఆహా ఓటీటీ వేదికపై ఈ వెబ్ సిరీస్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట క్రిష్.
By July 31, 2020 at 10:10AM
No comments