Breaking News

అనంతలో దారుణం.. యువతిని బెదిరించి ఏఆర్ కానిస్టేబుల్ గ్యాంగ్ రేప్


అనంతపురం జిల్లాలో ఓ పోలీసే కీచకుడిగా మారిన దారుణ ఘటన చోటుచేసుకుంది. బోయకొట్లాలలో ఓ యువతిని బెదిరించి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. కొట్టాలపల్లి వద్ద యువకుడితో మాట్లాడుతుండగా యువతి దగ్గరగా రాజశేఖర్ అనే వ్యక్తి అక్కడకు వెళ్లాడు. దీంతో ఆమెను బెదిరించి పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని తీసుకెళ్లాడు. అయితే ఆమెను పోలీస్ స్టేషన్‌కు నేరుగా తీసుకెళ్లకుండా రాజశేఖర్ కోవూరులో తాను ఉంటున్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్‌కు ఫోన్ చేసి తన గదికి రమ్మన్నాడు. అతడితో కూడా యువతిపై అత్యాచారం చేయించాడు. అయితే కొట్టాలపల్లి వద్ద యువతిని కలిసిన యువకుడికి అనుమానం రావడంతో అతడు వెంటనే డయల్ 100కు ఫోన్ చేశాడు. జరిగిన విషయాన్ని వారికి చెప్పాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఏఆర్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. జిల్లాలో జరుగుతున్న ఇలాంటి ఘటనలపై జిల్లా అధికారులు మండిపడుతున్నారు. గతంలో ఉరవకొండలో కూడా ఇలాగే ఓ పోలీసు ప్రేమికుల్ని నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించాడు. వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.


By July 07, 2020 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ar-constable-gang-rape-on-woman-in-anantapur/articleshow/76827294.cms

No comments