షాకింగ్: యువ హీరో దంపతులకు కరోనా.. సినీ ఇండీస్ట్రీని ఆందోళనకు గురిచేస్తున్న కొత్త కేసులు
దేశాన్ని వణికిస్తున్న మహమ్మారి క్రమంగా సినీ ఇండస్ట్రీలో తిష్ట వేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కొక్కరుగా సినీ నటులు కరోనా బారిన పడుతుండటం పరిశ్రమ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన సినీ, టీవీ నటులకు కరోనా సోకగా.. తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేగింది. ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు అలాగే అతని భార్య ప్రేరణ కరోనా బారిన పడ్డారు. తమకు అని తేలిన విషయాన్ని స్వయంగా ధృవ్ సర్జా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తనకు, తన భార్యకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్‌లు చేయించుకోగా.. ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ధృవ్ తెలిపారు. అయితే అభిమానులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తామనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తనతో కాంటాక్ట్ అయిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. నాతో తిరిగినవారందరూ ఆరోగ్యంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నానని ధృవ్ అన్నారు. Also Read: ఇటీవలే ధృవ్ సర్జా అన్న చిరంజీవి సర్జా గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే తిరిగి అదే కుటుంబంలో కరోనా పాజిటివ్ కేసులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరోవైపు సినీ ఇండీస్ట్రీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్స్ తిరిగి నిలిపివేయాలని, కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చాకే షూటింగ్స్ ప్రారంభించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి.
By July 16, 2020 at 09:31AM
No comments