Breaking News

భారత్‌కు వ్యతిరేకంగా జీవాయుధాలపై పాాక్-చైనా ప్రయోగం.. ఆస్ట్రేలియా మీడియాా సంచలన కథనం


ప్రమాదకరమైన జీవ ఆయుధాల తయారీకి పాకిస్థాన్‌, చైనాలు ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియా పత్రిక ఓ సంచనల కథనం వెలువరించింది. ఆంత్రాక్స్‌ సహా పలు ప్రమాదకర జీవాయుధాలకు సంబంధించిన పరిశోధనలు ఆ రెండు దేశాలు చేపట్టాయని పరిశోధనాత్మక దినపత్రిక ద క్లాక్సన్ తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన సైనిక రక్షణ శాస్త్ర, సాంకేతిక సంస్థ (డెస్టో)తో చైనాకు చెందిన వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుందని పేర్కొంది. ‘కొత్తగా ఉత్పన్నమవుతున్న అంటువ్యాధులు.. వ్యాప్తి, నియంత్రణ’పై సంయుక్తంగా పరిశోధన చేయడం దీని ప్రధాన ఉద్దేశమని వివరించింది. భారత్ సహా పాశ్చాత్య ప్రత్యర్థులపై విస్తృత దాడిలో భాగంగానే ఈ ప్రయోగాలకు రెండు దేశాలు శ్రీకారం చుట్టాయని ఆ కథనంలో తెలిపింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వుహాన్ వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పుట్టిందని చైనా విమర్శలను ఎదుర్కొంది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి చైనా తన సరిహద్దుల వెలుపల జీవాయుధాలను పరీక్షించే రహస్య ప్రాజెక్ట్ చేపట్టినట్టు నిఘా వర్గాలు గుర్తించాయని ది క్లాక్సన్ తెలిపింది. ఈ ప్రాజెక్టు ఆర్ధిక, సాంకేతిక సహాకారం మొత్తం వుహన్ ల్యాబ్ అందజేస్తుందని పేర్కొంది. అంతేకాదు, బాసిల్లాస్ థురెంజెనిసిస్‌ను వేరుచేసే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్టు తెలియజేసింది. బీటీ, బాసిల్లస్ ఆంత్రాసిస్ ఒక వర్గీకృత బయో-ఆయుధాల మధ్య ఉన్న సారూప్యతను పరిశీలిస్తే, బ్యాక్టీరియాను నిర్వహించడంలో పరిజ్ఞానం, ప్రమాదకర జీవాయుధ సుసంపన్నం చేయగలదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ‘ పాక్‌కు బాసిల్లాస్ థురెంజెన్సిస్ కారకాలను అందజేసిందని, సొంతంగా వైరస్ సేకరణకు డేటాబేస్ అభివృద్ధి చేయడంలో సహకారం, వ్యాధికారక బయో ఇన్ఫర్మాటిక్స్ మ్యానుప్యులేటింగ్‌పై విస్తృతమైన శిక్షణను అందిస్తోంది’ అని నివేదిక తెలిపింది. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. పాకిస్థాన్2కు వైరస్ జన్యువుల గుర్తింపు, ప్రమాదకరమైన సూక్ష్మజీవుల ప్రాప్యత, పరిశోధన, అంటువ్యాధుల కోసం జన్యు సాధనాల వినియోగం సామర్థ్యాన్ని పెంచడానికి దోహపడుతుంది. అయితే ఈ వార్తలను పాకిస్థాన్‌ కొట్టిపారేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కథనమని పేర్కొంది.


By July 27, 2020 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-covert-deal-with-pakistan-for-bio-warfare-capabilities-against-india-western-countries-report/articleshow/77190131.cms

No comments