Breaking News

ఇలియానా ఒళ్లు మండేలా ప్రశ్నించిన నెటిజన్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన గోవా బ్యూటీ


సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద విమర్శలు, ప్రశంసలు కామన్. కొందరు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ మధ్య సోషల్ మీడియాలో తమపై వచ్చిన కామెంట్లకు, సెటైర్లకు స్పందిస్తున్నారు. తమను ఇబ్బందికర ప్రశ్నలు వేసే నెటిజన్లకు దిమ్మతిరిగే సమాధానం ఇస్తున్నారు. తాజాగా ఇలియాన నెటిజన్‌కు ఇలాంటి సమాధానమే ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గురించిన అన్ని విషయాలనూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకునే ఈ గోవా బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెప్పింది. దీంతో నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న ఇలియానాకు ఆగ్రహాన్ని తెప్పించింది. "మీరు ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారా? లేక ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నారా?" అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనిపై మండిపడింది. ఓ జంతువు ఫోటోను పోస్ట్ చేస్తూ అతడికి సమాధానం ఇచ్చింది. "ఇతరుల అఫైర్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనకు చాలా ఎక్కువగా ఉంటుంది కదా?" అని వ్యాఖ్యానించింది. దీంతో ఇలియానా పోస్టుకు పలువురు నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు. ఆమె సరిగ్గా స్పందించిందని పలువురు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇటీవలే ఇలియానా తన ప్రియుడితో బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఇలియానా గతంలో డేటింగ్ చేసింది. ఆపై గత ఆగస్టులో వీరిద్దరూ విడిపోగా, అప్పటి నుంచి ఇలియానా సింగిల్ గానే ఉంటోంది.


By July 02, 2020 at 12:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-ileana-dcruzs-response-to-a-netizen-who-asked-about-her-relation-ship/articleshow/76745418.cms

No comments