వికారాబాద్: శ్రీకాకుళం మహిళపై గ్యాంగ్ రేప్.. చంపేసి దహనం చేసిన కామాంధులు
జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. గుర్తుతెలియని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు అనంతరం ఆమెను చంపేసి ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేసేశారు. జిల్లాలోని పూడూరు మండలం సోమన్‌గుర్తి సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై సోమన్‌గుర్తి గేటు సమీపంలో పాడుబడిన గదిలో సోమవారం ఉదయం సగం కాలిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. Also Read: వారిచ్చిన సమాచారంతో పరిగి సీఐ లక్ష్మిరెడ్డి, ఎస్సై భీంకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. సంఘటనా స్థలంలో మద్యం సీసాలు, కర్ర, రక్తపు మరకలు గుర్తించారు. మృతదేహానికి సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణానికి చెందిన ప్రైవేటు స్కూల్ అడ్రస్ రాసి ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాళ్లకు మెట్టెలు ధరించి ఉండటంతో ఆమె వివాహితురాలని నిర్ధారించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి దహనం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. Also Read: ‘సంఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి కనీసం ఇద్దరు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అంచనాకు వచ్చినట్లు పరిగి సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. నిందితులు కారు లేదా లారీలో ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులను వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. Also Read:
By July 28, 2020 at 07:52AM
No comments