ఆహా వెబ్ సిరీస్... మాటలు రాసిన పవన్ డైరెక్టర్..?
ఓటీటీకి జనాల్లో పెరుగుతున్న ఆదరణ కారణంగా మార్కెట్లోకి వెబ్ సిరీస్ లు వరదలా వచ్చేస్తున్నాయి. ఓటీటీలో మేజర్ ఫీల్డ్ ఆక్రమించిన అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటివి ట్రెండింగ్ సిరీస్ లతో ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తున్నాయి. అయితే వీటికి పోటీగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ చాలా వచ్చేస్తున్నాయి. వచ్చాయి కూడా.. అలా వచ్చిన వాటిలో అల్లు అరవింద్ ఆహా కూడా ఒకటి. వందశాతం తెలుగు కంటెంట్ ని ప్రేక్షకులకి అందిస్తున్న ఆహాకి సబ్ స్క్రయిబర్స్ బాగానే పెరిగారు.
కొత్త సినిమాలతో పాటు కొత్త కొత్త సిరీస్ లని అందించడానికి సిద్ధం అవుతున్న ఆహా టీమ్, ఆ పనులని టాలీవుడ్ దర్శకులకి అప్పగించిందట. ప్రస్తుతం చాలా మంది దర్శకులు ఆహాకోసం వెబ్ సిరీస్ లని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ దర్శకుల జాబితాలో నీది నాది ఒకే కథ డైరెక్టర్ వేణు ఊడుగుల కూడా ఉన్నారు. అయితే తాజాగా రుద్రవీణ పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందిందని సమాచారం. మెగాస్టార్ అవార్డ్ విన్నింగ్ మూవీ రుద్రవీణ టైటిల్ ని వెబ్ సిరీస్ కి పెట్టారు.
ఈ వెబ్ సిరీస్ లోని డైలాగులని డైరెక్టర్ క్రిష్ రాసాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్న క్రిష్, ఆహా కోసం రూపొందించే వెబ్ సిరీస్ లకి స్క్రిప్టు వర్క్ చేస్తున్నాడట. అందులో భాగంగానే రుద్రవీణ సిరీస్ కి మాటలు అందించాడని టాక్. మరి ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
By July 25, 2020 at 06:30PM
No comments