Breaking News

యూపీ పోలీసుల హత్య: గొడ్డలితో తల, కాళ్లు చేతులు నరికి.. పోస్ట్‌మార్టం నివేదికలో భయంకర నిజాలు


ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐల సహా ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హత్యకేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగస్టర్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై అతడి అనుచరులు కాల్పులకు పాల్పడ్డారు. అయితే, మావోయిస్టుల తరహాలో పోలీసులపై క్రిమినల్స్ గెరిల్లా దాడికి పాల్పడినట్టు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేసేలా తల, కాళ్లు, వేళ్లను గొడ్డలితో వేరుచేసి అత్యంత క్రూరంగా పోలీసులను చంపినట్టు నివేదిక తెలిపింది. సర్కిల్ ఆఫీసర్ డీఎస్పీ ర్యాంకు అధికారి దేవేంద్ర మిశ్రాను గొడ్డలితో ముక్కలు ముక్కులుగా చేశారు.. పోలీసుల నుంచే ఆయుధాలను లాక్కుని సబ్-ఇన్‌స్పెక్టర్‌కు పాయింట్ బ్లాక్ నుంచి కాల్పులు, ఓ కానిస్టేబుల్‌ను ఏకే 47తో కాల్చి చంపారు. పోలీసులపై దాడిలో కనీసం 60 మంది వరకూ అనుచరులు పాల్గొని ఉంటారని, ఇది మావోయిస్ట్ ఆపరేషన్‌ మాదిరిగా ఉందని దర్యాప్తుల్లో పాల్గొన్న పరిశోధకులు, ఫోరెన్సిక్ నిపుణులు, ఎస్‌టిఎఫ్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్ల శరీరం నుంచి ఏడు బుల్లెట్లను వైద్యులు బయటకు తీశారు. శివరాజ్‌పూర్ స్టేషన్ ఆఫీసర్ మహేశ్ యాదవ్, ఎస్ఐ అనూప్ సింగ్ ముఖం, చాతీ, భుజాలపై బుల్లెట్ గాయాలున్నాయి. కానిస్టేబుల్ జితేంద్ర పాల్‌ను ఏకే 47తో, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు రాహుల్, బబ్లూ, సుల్తాన్‌లపై 315 బోర్ రైఫిల్స్‌తో కాల్చి చంపినట్టు ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. మృతదేహాలపై గాయాలు ముఖ్యంగా తల, భుజాలపై ఉండట దర్యాప్తు అధికారులను షాక్‌కు గురిచేస్తోంది. ఎత్తైన ప్రదేశంలో ఉండి, ఆకస్మికంగా దాడి చేసినట్టు తెలియజేస్తుంది. అర్ధరాత్రి జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పోలీసు బృందాన్ని ముట్టడించడానికి పైకప్పులపై స్నిపర్‌లను ఉంచినట్టు భావిస్తున్నారు. ‘ఇటువంటి గెరిల్లా తరహా ఆకస్మిక దాడి ఉత్తరప్రదేశ్‌లో చాలా అరుదైంది. మొదట రోడ్డుకు అడ్డంగా జేసీబీని ఉంచి పోలీసులను ఉచ్చులోకి లాగారు.. ముఠా సభ్యులు పైకప్పుల నుంచి కాల్పులు జరిపారు. ఇది మావోయిస్టులు అవలంబించిన సాధారణ వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా పోలీసులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు’ అని కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.


By July 05, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kanpur-firing-in-maoist-style-ambush-vikas-dubeys-men-cut-cos-head-toes-says-autopsy-report/articleshow/76793976.cms

No comments