చిరంజీవి అల్లుడికి కరోనా టెస్ట్.. స్వయంగా పేర్కొంటూ సోషల్ మీడియాలో సందేశమిచ్చిన మెగా హీరో
చిన్నల్లుడు, శ్రీజ భర్త చేయించుకున్నారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్ రీ ఓపెన్ అయ్యాక, తన లేటెస్ట్ మూవీ '' సినిమా సెట్స్ పైకి వచ్చారు కళ్యాణ్ దేవ్. అయితే ప్రస్తుతం దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీర విజృంభణ చేస్తున్న కారణంగా కరోనా టెస్ట్ చేయించుకున్నాకే కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు ఈ మెగా అల్లుడు. ప్రతిరోజు షూటింగ్‌కి వెళ్తున్న కళ్యాణ్ దేవ్.. తాజా పరిస్థితుల దృష్ట్యా ఇన్ని రోజులు తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో సింగల్ గానే ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్ షూటింగ్ మొత్తం ఫినిష్ చేసిన ఆయన, నేరుగా వెళ్లి COVID-19 టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో అతనికి నెగెటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన కళ్యాణ్ దేవ్.. కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా షూటింగ్ నుంచి నేరుగా వెళ్లి టెస్టులు చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చానని చెప్పారు. Also Read: ఈ మేరకు తన భార్యాపిల్లలతో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. షూటింగ్ చేశాక ఇన్ని రోజులు పూర్తిగా సెల్ప్-ఐసొలేషన్‌లోనే ఉన్నానని, తనపై శ్రద్ధ చూపించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని అన్నారు. మీ ప్రేమను పొందడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. మొత్తానికైతే ఈ పరిస్థితుల్లో కూడా కళ్యాణ్ దేవ్ షూటింగ్ ఫినిష్ చేసి సేఫ్‌గా తిరిగి రావడం పట్ల మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
By July 13, 2020 at 08:54AM
No comments