కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య అర్జున్.. టెస్టుల్లో నెగిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్ కూతురు కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఐశ్వర్యకు నెగిటివ్‌గా తేలింది. ఈ నెల 20న తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఐశ్వర్య వెల్లడించారు. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నానని, తనతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. అర్జున్ కుటుంబంలో పలువురికి కరోనా సోకింది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య, మేనల్లుడు ధృవ్ సర్జా, అతడి భార్య ప్రేరణా శంకర్‌కు కరోనా సోకింది. వీరంతా ఇప్పుడు కోలుకోవడంతో అర్జున్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. అటు బాలీవుడ్‌లో బిగ్ బీ ఫ్యామిలీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అమితాబ్, అభిషేక్ బచ్చన్‌తో పాటు, ఐశ్వర్య, ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. అయితే వీరంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఐశ్వర్య, ఆరాధ్యకు కూడా తాజాగా జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది.
By July 28, 2020 at 09:38AM
No comments