Breaking News

కోడలితో మామ శృంగార లీలలు.. కొడుక్కి తెలిసిపోవడంతో.. దారుణం


దారుణ హత్యకు దారితీసింది. వావీవరసలు మరచి కోడలితో రాసలీలలు సాగించిన మామ చివరికి కొడుకు చేతిలోనే హతమయ్యాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో జిల్లాలో చోటుచేసుకుంది. పెన్నగరం పరిధిలోని ఎంకే నగర్‌కి చెందిన మునియప్పన్‌‌కి ఆరుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఆయన భార్య కొద్దికాలం కిందట మరణించడంతో ఒంటరిగానే నివసిస్తున్నాడు. అతని ఇంటికి సమీపంలోనే నాల్గో కుమారుడు(45), కోడలు(40) నివసిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన మునియప్పన్ కూతురులా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేసి ఆమెను లొంగదీసుకున్నాడు. కొడుకు లేని సమయంలో ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగిస్తున్నారు. ఆ విషయం కొడుక్కి తెలిసిపోవడంతో ఇద్దరినీ మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని తీవ్రంగా హెచ్చరించాడు. Also Read: అయినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కోపంతో రగిలిపోయాడు కొడుకు. మద్యం మత్తులో నేరుగా తండ్రి ఇంటికెళ్లి నిద్రపోతున్న మునియప్పన్‌ని దారుణంగా చంపేశాడు. తలమీద బండరాయి వేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తండ్రిని చంపేశానని సోదరుడికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:


By July 27, 2020 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-father-over-extramarital-affair-in-tamil-nadu/articleshow/77191467.cms

No comments