భార్యపై కోపం ప్రియురాలి బిడ్డను చంపి నదిలో పడేసిన కిరాతకుడు
భార్యను వదిలేసి ప్రియురాలితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమెకు పుట్టిన బిడ్డను చంపి నదిలో పడేసిన దారుణ ఘటన ఒడిశాలో జరిగింది. నవరంగ్‌పూర్ జిల్లా ఝరిగాం సమితి చక్కోపొదర్ పంచాయతీ గాయిటొరా గ్రామానికి చెందిన వాసుదేవ్ జానికి గతంలో ఓ మహిళతో వివాహ జరిగింది. కొన్నాళ్లకు మరో మహిళతో ప్రేమలో పడిన అతడు భార్య వదిలేశాడు. పక్క గ్రామమైన బఘడొగరిలో ప్రియురాలితో కాపురం పెట్టాడు. ఈ క్రమంలోనే 20 రోజుల క్రితం ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. Also Read: ఈ విషయం తెలుసుకున్న భార్య వారింటికి వచ్చి గొడవ పెట్టుకుంది. దీంతో విసుగు చెందిన వాసుదేవ్‌జాని ప్రియురాలికి పుట్టిన బిడ్డను బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేసి నదిలో పడేశాడు. బిడ్డతో వెళ్లిన ప్రియుడు ఒంటరిగా రావడంతో అనుమానమొచ్చిన మహిళ నిలదీయగా చంపేసిన నదిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు వాసుదేవ్‌జానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By July 05, 2020 at 09:40AM
No comments