ఏంది సారూ!! మా కరెంట్ బిల్.. సందీప్ కిషన్ సెటైర్లు
లాక్ డౌన్‌లో కరెంట్ బిల్లుల షాక్.. హీరో సందీప్ కిషన్‌కి తగిలింది. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉండటంతో కరెంట్ వాడకం బాగా ఎక్కువైంది. ఈ లాక్ డౌన్‌లో విద్యుత్ వినియోగం బాగా ఎక్కువ కావడంతో.. విద్యుత్ బిల్లులు కూడా పేలిపోతున్నాయి. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చెల్లించలేక సామాన్యులు గగ్గోలు పెడుతుంటే.. సెలబ్రిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే తాప్సీ, కార్తీక లాంటి సెలబ్రిటీలకు కరెంట్ బిల్లులు షాక్ తగలగా.. ఈ విషయాన్ని షేర్ చేస్తూ పవర్ బిల్లులపై పవర్ ఫుల్ పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా సైతం స్పందిస్తూ.. ‘పవర్ బిల్లులు ఇలాగే వస్తే.. నెక్ట్స్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చింది అని ఆన్‌లైన్ వార్ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ‘మా ఇంట్లోని ఎలక్ట్రిసిటీ బోర్డు మీటర్‌ని చూస్తే చిన్నప్పుడు గిర్రుమంటూ తిరిగే ఆటో రిక్షా మీటర్ గుర్తొచ్చింది. ఏంది సర్ ఆ బిల్లులు. కొత్తగా రిలీజైన సినిమాల వీకెండ్ కలెక్షన్లలా కరెంట్ బిల్లులు ఉన్నాయి’ అంటూ సెటైర్లు వేశాడు సందీప్ కిషన్. అయితే సందీప్ కిషన్‌కి ఎంత కరెంట్ బిల్ వచ్చిందన్న విషయాన్ని తెలియజేయకపోవడంతో.. ఇంతకీ మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది? అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొంత మంది స్పందిస్తూ.. మాకు ఇంతకు ముందు రూ.300 వచ్చేది.. కాని లాక్ డౌన్ వల్ల 3230 వచ్చింది, అయినా ఇంట్లోనే ఉండి ఏసీలు అన్నీ వేసుకుని ఉంటే బిల్ రాకుండా బాక్సాఫీస్ కలెక్షన్లు వస్తాయా? అయినా వీకెండ్ కలెక్షన్లు ఎప్పుడూ మీకే రావాలా?? ఈ సారి ఫర్ ఆ చేంజ్ గవర్నమెంట్ కి వస్తున్నాయ్ సందీప్ అన్న’.. అంటూ సందీప్ కిషన్ పోస్ట్‌పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
By July 01, 2020 at 09:47AM
No comments