గుంటూరు: కన్నతల్లిపైనే కామంతో రెచ్చిపోయిన కొడుకు.. చివరికి
జిల్లా బాపట్లలో దారుణం జరిగింది. నవమాసాలు కనిపెంచిన కన్నతల్లినే చెరబట్టాలని చూశాడో కామాంధుడు. అతడి వేధింపులకు విసిగిపోయిన ఆ మాతృమూర్తి అపర కాళికైంది. అతని జీవితానికి మరణ శాసనం రాసింది. గుంటూరు జిల్లా మండలానికి చెందిన యువకుడికి (30) ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసై, రోజూ హింసిస్తుండటంతో భార్య తన ఇద్దరు బిడ్డలను తీసుకుని నాలుగేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. నాటి నుంచి అతడిని తల్లే పోషిస్తోంది. ఆ దుర్మార్గుడు తాగడానికి డబ్బులివ్వాలంటూ తరుచూ తల్లిని కొట్టేవాడు. ఇటీవల తీవ్రంగా కొట్టడంతో ఆమె బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. Also Read: అయితే లాక్‌డౌన్ కారణంగా తన బిడ్డ తిండికి ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న ఆ తల్లి తిరిగొచ్చేసింది. సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై మద్యం మత్తులో ఉన్న ఆ దుర్మార్గుడు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో షాకైన ఆమె వెంటనే తేరుకుని అతడి కళ్లల్లో కారం కొట్టింది. కావిడి తాడును అతని మెడకు బిగించి చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కుమారుడి నుంచి తాను ఎదుర్కొన్న క్షోభను డీఎస్పీ, బాపట్ల రూరల్ సీఐలకు ఏడుస్తూ వివరిస్తున్న ఆమెను చూసి స్థానికులూ కంటతడి పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 28, 2020 at 07:03AM
No comments