భర్తతో గొడవ పడిన మహిళ... క్షణికావేశంలో బిడ్డను చంపి తానూ ఆత్మహత్య
భర్తతో గొడవ పడిన ఓ మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు ప్రాణాలను బలిగొన్న ఘటన తమిళనాడులో విషాదం నింపింది. ఏడాది వయసున్న బిడ్డను తన చేతులతో చంపేసిన తల్లి తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. కాట్టుమన్నార్‌కోవిల్ ప్రాంతానికి చెందిన బాలమురుగన్(27), ప్రియాంక(22) మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మీనలోచిని(1) కుమార్తె ఉంది. ఇటీవల దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: శుక్రవారం(జులై 3) కూతురిని ఏడాది నిండటంతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రియాంక అనుకుంది. ఇదే విషయమై దంపతులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన ప్రియాంక కూతురితో కలిసి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. భార్య ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలమురుగన్ లోనికి వెళ్లి చూడగా ప్రియాంక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మంచంపై కూతురు విగతజీవిగా పడింది. దీంతో ఆమె కూతురిని గొంతు నులిమి చంపేసి అనంతరం ఉరేసుకున్నట్లు నిర్ధారించుకున్న బాలమురుగన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 05, 2020 at 08:18AM
No comments