Breaking News

కరోనా కేసుల్లో భారత్ మరో ఫీట్.. నాలుగు రోజుల్లోనే 8 లక్షలు దాటేసింది!


పాజిటివ్ కేసుల్లో మరో రికార్డు భారత్ సొంతమైంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల దాటేయగా.. 7 లక్షల నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే ఈ మార్క్‌కు చేరడం గమనార్హం. కరోనా మరణాలు కూడా 22,000 దాటాయి. ఇక, రోజువారీ కేసుల్లో శుక్రవారం కొత్త రికార్డు నమోదయ్యింది. ఏకంగా 27వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గడచిన మూడు రోజుల నుంచి రోజువారీ పాజిటివ్ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఆరు రోజుల తర్వాత కరోనా వైరస్ మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 520 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ 16 (2003), జులై 6 (608) తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కరోనాతో చనిపోవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో మొత్తం 27,449 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 8,21,722కి చేరింది. జూన్‌ నెల మొత్తం 4 లక్షల కేసులు నమోదయితే, జులై తొలి 10 రోజుల్లోనే 2.36 లక్షల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇక, జూన్‌లో 12వేల మరణాలు సంభవించగా.. ఈ నెలలో కేవలం 10 రోజుల్లోనే 4,733 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఏకంగా 7,862 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. 226 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు కొత్త రికార్డులు సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ (1,608), ఉత్తరప్రదేశ్ (1,347), బెంగాల్ (1,198), గుజరాత్ (875), ఒడిశా (755), కేరళ (416), మణిపూర్ (146)‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1608 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 1576 కాగా.. 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం గుర్తించిన కేసులు అంతకుముందుతో పోల్చితే కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మొత్తం 1,278 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది.


By July 11, 2020 at 07:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-count-tops-8-lakh-deaths-cross-22000-in-india/articleshow/76903210.cms

No comments