రూ.50లక్షల కట్నం ఇవ్వలేక పెళ్లి రద్దు.. మహిళా టెక్కీకి ఎన్నారై వేధింపులు
అధిక కట్నం ఇచ్చుకోలేక పెళ్లి రద్దు చేసుకున్నారన్న కక్షతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. తల్లిదండ్రులు తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుంది. యూరప్‌లో ఉంటున్న వినయ్‌కుమార్ అనే యువకుడి వివరాలు నచ్చడంతో అతడిని కాంటాక్ట్ చేసింది. అతడికి కూడా యువతి నచ్చడంతో హైదరాబాద్ చేరుకుని తల్లిదండ్రులతో కలిసి పెళ్లిచూపులకు వెళ్లాడు. Also Read: రెండు కుటుంబాలు కూడా ఈ సంబంధం నచ్చడంతో అందరూ సంతోషపడ్డారు. అయితే తనకు కట్నకానుకల కింద రూ.50లక్షలు ఇవ్వాలని వినయ్ కోరడం అమ్మాయి తరపు వారు షాకయ్యారు. తాము అంత కట్నం ఇచ్చుకోలేమని చెప్పినా అతడు వినిపించుకోలేదు. అడిగినంత కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో యువతి ఆ సంబంధాన్ని రద్దు చేసుకుంది. Also Read: దీంతో ఆమెపై కక్షగట్టిన వినయ్‌కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. తరుచూ ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. వాట్సాప్‌లో అశ్లీల వీడియోలు, ఫోటోలు పంపిస్తూ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సైబరాబాద్ షీ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వినయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By July 17, 2020 at 10:58AM
No comments