Breaking News

అత్తారింటికి వెళ్తూ మృత్యు ఒడికి.. పెళ్లయిన 40 రోజులకే యువకుడి మరణం


పెళ్లయిన 40 రోజులకే ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా మండలంలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లికి చెందిన జల్లూరి సోమరాజు (22)కు కైకలూరు మండలంలోని చటకాయ గ్రామానికి చెందిన యువతితో 40 రోజుల కిందట వివాహమైంది. ఆ వెంటనే ఆషాఢ మాసం రావడంతో యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. శ్రావణ మాసం రావడంతో భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు సోమరాజు శుక్రవారం బైక్‌పై అత్తారింటికి బయలుదేరాడు. Also Read: కాసేపట్లో అత్తారింటికి చేరుతాడనగా చటకాయ గ్రామ శివారులో సోమరాజు బైక్ అదుపుతప్పింది. వేగంగా డివైడర్‌ను ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు అతడిని వెంటనే కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భర్త కాపురానికి తీసుకెళ్తాడని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న యువతి అతడి మరణవార్త విని షాక్‌కు గురైంది. పెళ్లయిన 40 రోజులకే భర్త చనిపోవడంతో ఆమె దురదృష్టాన్ని చూసి గ్రామస్థులందరూ ఆవేదన చెందుతున్నారు. Also Read:


By July 25, 2020 at 10:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-man-died-in-road-accident-in-krishna-district/articleshow/77162756.cms

No comments