Breaking News

రక్షణ పరికరాల కొనుగోలు కేసు: జయాజైట్లీ సహా మరో ఇద్దరికి 20ఏళ్లు జైలు శిక్ష


అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని నాటి ఎన్డీయే ప్రభుత్వ హాయంలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోలు అవకతవకల కేసులో సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయాజైట్లీ సహా మరో ఇద్దరిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. జయాజైట్లీ సహా రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్పీ మురగయ్, గోపాల్ పచేర్‌వాల్‌ను దోషులుగా నిర్ధరించి, నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దోషులకు రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధిస్తూ ఈ మేరకు గురువారం తీర్పును వెలువరించింది. 2001 జనవరిలో తెహల్కా డాట్‌కామ్ ‘ఆపరేషన్‌ వెస్టెండ్‌’ పేరుతో నిర్వహించిన ఇన్వెస్టిగేషన్‌లో ఈ వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే. తెహల్కా జర్నలిస్ట్ తాను రక్షణ పరికరాలను అమ్మే ‘వెస్టెండ్‌ ఇంటర్నేషనల్‌’ప్రతినిధినంటూ జయాజైట్లీని పరిచయం చేసుకున్నారు. సైన్యానికి అవసరమైన థర్మల్‌ ఇమేజర్స్‌ను తాము ఉత్పత్తి చేస్తుంటామని, దీనికి సంబంధించిన కాంట్రాక్టును నాటి రక్షణ మంత్రి జార్జిఫెర్నాండెజ్‌కు చెప్పి ఇప్పించాల్సిందిగా జయాజైట్లీని కోరారు. దీనికి ఆమె అంగీకరిస్తూ.. రూ. 2 లక్షలు తన ప్రతినిధి గోపాల్‌ పచేర్‌వాల్‌కు ఇవ్వాలని సూచించింది. అంతకు ముందు జయాజైట్లీతో సమావేశం ఏర్పాటు చేయిస్తానంటూ రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ మురగయ్‌ తెహల్కా విలేకరి దగ్గర రూ.20 వేలు తీసుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని తెహల్కా విలేకరులు.. కెమెరాల్లో బంధించారు. దీంతో రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కేసులో జయాజెట్లీ సహ మిగతా నిందితులపై 2006లో కేసు నమోదుచేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. తాజాగా జయాజైట్లీ సహా పచేరివాల్‌, మురగయ్‌‌లను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. అంతేకాదు, గురువారం సాయంత్రం లోపు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే జయాజైట్లీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆమెకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. తెహల్కా ఆపరేషన్‌లో నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూడా ఆరోపణలు ఎదుర్కొవడం కాదు, దోషిగా నిర్ధారణ అయ్యారు. తనను కలిసిన జర్నలిస్ట్‌ల వద్ద బంగారు లక్ష్మణ్ కూడా డబ్బు తీసుకున్నారు. తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌ కేసులో దోషిగా తేలిన బంగారు లక్ష్మణ్‌ను బీజేపీ తొలగించింది.


By July 31, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/20-years-on-jaya-jaitly-retired-general-get-4-years-jail-for-graft-in-operation-westend/articleshow/77276094.cms

No comments