ఆస్తి కోసం ఘాతుకం.. రూ.20 లక్షల సుపారీ ఇచ్చి కన్నతండ్రి హత్య
ఆస్తి దక్కించుకునేందుకు తండ్రిని హత్య చేయించిన ఘటన జిల్లా తిరుపతిలో జరిగింది. చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన ఈతమాకుల గురవయ్య(75)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మకు గురమ్మ, గంగయ్య ఇద్దరు పిల్లలు. లక్ష్మమ్మ 1982లో చనిపోవడంతో 1984లో మారెమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టడంతో అప్పటి నుంచి వారితోనే ఉంటున్నారు. గురవయ్యకు తన పూర్వీకుల నుంచి తిరుపతిలో 1.75 ఎకరాల పొలం వచ్చింది. Also Read: ఆ భూమినంతటిని రెండో పిల్లలను రాసిచ్చేందుకు గురవయ్య సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటిభార్య కొడుకులు తమకు కూడా సగం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో ఏడాది కిందట గురవయ్యతో మొదటి భార్య కొడుకు గంగయ్య గొడవపడ్డాడు. తన ఇంటి పక్కనున్న 350 అంకణాల స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు ఇచ్చినా తండ్రి అడ్డుపడటంతో గంగయ్య కోపంతో రగిలిపోయాడు. తండ్రిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని భావించిన గంగయ్య తన కుమారుడు తిరుమలేష్‌కు పరిచయస్తుడైన తిరుపతికి చెందిన గౌతమ్ ద్వారా ఉమేష్ అనే సుపారీ కిల్లర్‌ను పరిచయం చేసుకున్నాడు. తన తండ్రికి హత్య చేయడానికి రూ.20 లక్షలు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. Also Read: ఉమేష్ తనకు పరిచయమున్న దాము ద్వారా కిరణ్, సతీష్‌తో హత్య ఒప్పందం చేసుకున్నాడు. గత నెల 26వ తేదీ మధ్యాహ్నం నెంబరు ప్లేటు లేని స్కూటీలో సతీష్, కిరణ్ నగరంలోని చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలో ఉంటున్న గురవయ్య ఇంటి వద్దకు వెళ్లారు. వెంట తెచ్చుకున్న కత్తి తీసి గురవయ్య గొంతు, చాతీపై పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు. మృతుడి రెండో భార్య కొడుకు రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులైన ఏడుగురిని తిరుపతి ఆర్‌సీ గేటు వద్ద పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి ఓ కత్తి, మూడు బైకులు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. Also Read:
By July 08, 2020 at 08:16AM
No comments