Virata Parvam: ప్రియమణి బర్త్ డే ట్రీట్.. కామ్రేడ్ భరతక్క ‘విరాటపర్వం’ నుంచి
నేడు జూన్ (04) బర్త్ డే కావడంతో ఆమె కీలకపాత్రలో నటిస్తున్న ‘విరాట పర్వం’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి హీరో హిరోయిన్లుగా నటిస్తున్న చిత్రం . 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీలో రానా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే హీరో రానా లుక్‌తో పాటు.. హీరోయిన్ సాయి పల్లవి లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సాయి పల్లవి లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అమరవీరుల స్థూపం దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్న సాయి పల్లవి లుక్ కథా నేపథ్యాన్ని కళ్లకు కట్టింది. కాగా గురువారం నాడు ప్రియమణి బర్త్ డే కావడంతో ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌తో సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో కామ్రేడ్ భరతక్కగా నక్సలైట్ పాత్రలో కనిపించబోతుంది ప్రియమణి. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది.ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట పర్వం లో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం అంటూ ఈ ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో నల్లటి డ్రెస్ చిరునవ్వులు చిందిస్తూ.. గన్ పట్టుకుని ‘కామ్రేడ్ భారతక్క’ పాత్రలో ఇమిడిపోయింది ప్రియమణి. వర్క్ విషయంలో రాజీ పడని ప్రియమణితో వర్క్ చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ‘విరాటపర్వం’ హీరోయిన్ సాయి పల్లవి ట్విట్టర్ ద్వారా ‘కామ్రేడ్ భరతక్క’కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
By June 04, 2020 at 09:56AM
No comments