Breaking News

వదినతో అక్రమ సంబంధం.. సొంత అన్ననే చంపి పాతిపెట్టిన తమ్ముడు


ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన జిల్లా ఆత్మకూరులో వెలుగుచూసింది. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని అతడి అన్నే చంపి పాతిపెట్టేశాడు. ఆత్మకూరులోని గరీబ్‌నగర్‌కు చెందిన నాగరాజు(27)కు ఈశ్వరమ్మ అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. నాగరాజు వృత్తి రీత్యా వెంట్రుకల సేకరణ, గ్రామాలు తిరుగుతూ బూందీ విక్రయిస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో తమ్ముడు మహేష్‌ ప్రవేశించాడు. తన మాయమాటలతో వదినను లోబరుచుకుని అన్న ఇంట్లో లేని సమయంలో ఆమెతో చనువుగా ఉండేవాడు. Also Read: ఒక్కోసారి భర్త ఎదురుండగానే ఈశ్వరమ్మ మరిదితో ఫోన్ మాట్లాడేది. దీంతో పద్ధతి మార్చుకోవాలంటూ నాగరాజు తన భార్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఇదే విషయంపై దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 24వ తేదీ నుంచి తన కొడుకు కనిపించడం లేదంటూ నాగరాజు తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలోనే శనివారం తెల్లవారుజామున నాగరాజు ఇంటి సమీపంలోని కంపచెట్ల మధ్య ఓ మృతదేహాన్ని కుక్కలు బయటకు లాగాయి. ఈ దృశ్యం చూసిన ఓ మహిళ ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. Also Read: దీంతో సీఐ గుణశేఖర్‌ బాబు, ఎస్సై ఓబులేసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చొక్కా, లుంగీ ఆధారంగా ఆ మృతదేహం తన కుమారుడిదేనని తల్లి గుర్తుపట్టింది. విచారణలో మహేష్‌, ఈశ్వరమ్మల అక్రమ సంబంధం వెలుగులోకి రావడంతో వారే నాగరాజును చంపి పూడ్చిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు చెబుతున్నా... వీరిద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతోనే వారిద్దరు కలిసి 24వ తేదీ రాత్రి నాగరాజును గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read:


By June 28, 2020 at 09:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-brother-in-kurnool-district-over-illagel-affair-with-sister-in-law/articleshow/76669719.cms

No comments