Breaking News

పనికోసం వచ్చిన బాలికపై కామం.. వ్యభిచారంలోకి దించి... ఆపై గ్యాంగ్ రేప్


ఉపాధి కోసం ఉత్తరాది రాష్ట్రం నుంచి తమిళనాడుకు వచ్చిన ఓ యువతి కామాంధుల చేతిలో చిక్కి విలవిల్లాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఓ యువతిని ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కారులో నుంచి తోసేశారు. బాధితురాలి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్న సమయంలో అంతకు ముందు యజమాని చేతిలో దారుణంగా మోసపోయిన ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. Also Read: ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం కర్ణాటకలోని బెంగళూరుకు వలస వచ్చింది. వారికి ఓ కూతురు ఉంది. ఓ ఇంట్లో పనిచేసేందుకు ఆమె ఐదు నెలల క్రితం తమిళనాడులోని తంజావూరుకు వచ్చింది. ఆమె పనిచేసే ఇంటి యజమాని సెంథిల్‌కుమార్‌ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల తర్వాత యువతిని వ్యభిచార వృత్తిలోకి దించాడు. విటులను తీసుకొచ్చి ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. అతడి బారి నుంచి తప్పించుకోవడానికి అనేకసార్లు ప్రయత్నించి బాధితురాలు విఫలమైంది. Also Read: చివరికి ఆదివారం రాత్రి ఆ కిరాతకుడి బారి నుంచి తప్పించుకుని బయటపడిన యువతి రోడ్డు పక్కన సేద తీరుతోంది. ఆమెను గమనించి ముగ్గురు యువకులు కారులోకి బలవంతంగా ఎక్కించుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాధితురాలిని సానూరపట్టి కడై వీధి వద్ద పడేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం యువతిని గమనించిన మహిళా సంఘాల ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి స్పృహలోకి వచ్చిన యువతి వద్ద వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By June 05, 2020 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-gang-raped-in-tamil-nadu-case-registered/articleshow/76207241.cms

No comments