Breaking News

భారీ పార్టీ ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ! బర్త్ డే సీడీపీ రిలీజ్ చేస్తూ నారా బ్రాహ్మణి కామెంట్..


గత కొన్నిరోజులుగా నందమూరి నటసింహం బాలకృష్ణకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు జరిపిన చర్చలపై బాలయ్య కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. దీంతో నిత్యం బాలయ్య పేరు వార్తల్లో పతాక శీర్షికల్లో నిలుస్తోంది. ఇంతలోనే ఆయన బర్త్ డే సమీపించడం, కామన్ డీపీ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తాలూకు ఫోటోలు, ఈ బర్త్ డే సీడీపీనే దర్శనమిస్తోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ 60 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. పైగా అదే రోజు బాలయ్య తన షష్టి పూర్తి మహోత్సవాన్ని కూడా జరుపుకోనున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఆ రోజు నంద‌మూరి అభిమానుల‌కు పెద్ద పండగే అన్నమాట. ఈ క్రమంలోనే 60వ పుట్టిన‌రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట బాలకృష్ణ. తన స‌న్నిహితుల‌కు, స్నేహితులకు భారీ పార్టీ ప్లాన్ చేసిన ఆయన ఆ దిశగా సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించారని తెలుస్తోంది. Also Read: మరోవైపు తాజాగా బాలయ్య కూతురు ఆయన బర్త్‌డే కామన్ డీపీని విడుదల చేశారు. ఈ డీపీని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ''నాన్నగారు బాలకృష్ణ 60వ బర్త్ డే సీడీపీ రిలీజ్ చేయడం గర్వంగా ఉంది. ఆయన మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా'' అని కామెంట్ చేసింది బ్రాహ్మణి. డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ హంసా నందిని సహా మరెందరో సినీ ప్రముఖులు ఈ సీడీపీ తన సోషల్ మీడియా వాల్స్‌లో పోస్ట్ చేయడం విశేషం. ఇక ఈ బర్త్ డే సీడీపీని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఇందులో బాలయ్య శ్రీ కృష్ణదేవరాయలు గెటప్‌లోనూ, అలాగే ‘నిప్పురవ్వ’లోని మాస్ లుక్‌లోనూ కనిపిస్తున్నారు. జై బాలయ్య, హిందూపూర్, బసవతారకం వంటి పదాలతో పాటు ఆయన తల్లిదండ్రుల ఫోటోలు కూడా బ్యాక్ గ్రౌండ్‌లో కనిపిస్తున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ సీడీపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


By June 06, 2020 at 10:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-60th-birthday-cdp-viral-on-social-media/articleshow/76228843.cms

No comments