Breaking News

అల్లుడు అదుర్స్: రంగంలోకి దూకేందుకు రెడీ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్


దేశంలో కరోనా కాటుకు సెట్స్‌పై ఉన్న ప్రతిఒక్క సినిమా బలైపోయింది. ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. లాక్‌డౌన్ రావడంతో దాదాపు మూడు నెలలుగా కెమెరా స్విచ్చాన్ చేయకపోవడంతో షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయి.. విడుదల వాయిదా వేసుకున్నాయి. అయితే ఇటీవల షూటింగ్స్‌కి అనుమతులు రావడంతో తిరిగి ఒక్కొక్కరుగా సెట్స్ మీదకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారని తెలిసింది. 'రాక్షసుడు' మూవీ తర్వాత తన తర్వాతి సినిమాను సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు బెల్లకొండ శ్రీనివాస్. లాక్‌డౌన్‌కి ముందే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేస్తుకున్న ఈ మూవీకి 'అల్లుడు అదుర్స్' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్.. లాక్‌డౌన్ అమలులోకి రావడంతో చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా జరపలేకపోయింది. దీంతో సినిమా రిలీజ్ కూడా వాయిదాపడింది. Also Read: ఈ నేపథ్యంలో తాజాగా 'అల్లుడు అదుర్స్' తదుపరి షెడ్యూల్ కోసం డేట్స్ ఫిక్స్ చేశారట దర్శకనిర్మాతలు. ఈ షూటింగ్ వచ్చే నెల నుంచి హైదరాబాదులో జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరత్వరగా ఫినిష్ చేసేసి దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్ సరసన , నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ అల్లుడు అదుర్స్ చిత్రంలో 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఐటెం సాంగ్‌లో అందాల విందు చేయనుందని తెలిసింది.


By June 30, 2020 at 11:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bellamkonda-sai-srinivas-alludu-adurs-movie-shooting-update/articleshow/76704302.cms

No comments