భర్తను చంపి మర్మాంగం కోసేసిన భార్య.. ఏపీలో దారుణ ఘటన
జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మద్య కలహాలు చిచ్చు రేపాయి. భర్త వేధింపులు భరించలేకపోయిన మహిళ అతడిని మంచానికి కట్టేసి, మర్మాంగాన్ని కోసేసి కిరాతకంగా చంపేసింది. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామానికి చెందిన కఠారి అప్పారావు, తెలంగాణ రాష్ట్రంలోని దమ్మపేటకు చెందిన లక్ష్మి 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమార్తె(14) ఉంది. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న దంపతులు కొంతకాలంగా మద్యానికి బానిసలయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: దీనికి తోడు అప్పారావు రోజూ మద్యం తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు. భర్త వేధింపులతో విసిగిపోయిన లక్ష్మి అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. బుధవారం మద్యం తాగొచ్చి నిద్రపోతున్న అతడిని మంచానికి కట్టేసింది. మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చంపేసి అనంతరం కత్తితో మర్మాంగాన్ని కోసేసింది. అనంతరం భర్త సోదరుడు నాగేశ్వరరావుకు ఫోన్‌చేసి అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By June 05, 2020 at 07:20AM
No comments