Breaking News

పోర్న్ స్టార్ అయితేనే కంఫర్టబుల్.. నా కాన్సెప్ట్ అదే.. రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు


నిత్యం ఏదో ఒకరమైన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం రామ్‌గోపాల్ వర్మ ఒక్కడికే చెల్లుతుంది. విషయం ఏదైనా సరే తనదైన కోణంలోనే సమాధానం చెప్పి ఆలోచింపజేయడం ఆయన స్టైల్. అందుకే ఆయనపై ఎన్ని విమర్శలొచ్చినా కూడా ఫలానా టాపిక్‌పై వర్మ కామెంట్ ఏంటో వినాలి, ఆయన లాజిక్ ఏంటో తెలుసుకోవాలి అనే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ పీరియడ్‌లో ఆయన రూపొందించిన 'క్లైమాక్స్' మూవీ గురించి, పోర్న్ స్టార్ గురించి తాజా ఇంటర్వ్యూలో వర్మ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. 'క్లైమాక్స్' రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు వర్మ. గతంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆయన ఈ సారి 'క్లైమాక్స్' అంటూ మళ్ళీ ఆమెనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఓ రేంజ్ అలజడి సృష్టించాయి. మియాను చూపిన విధానం, ఆ సీన్స్ చూసి ఆశ్చర్యపోవడమే గాక ఈ మూవీ కోసం ఎదురుచూపులు స్టార్ట్ చేశారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో 'క్లైమాక్స్' చిత్రంలో ఇండియన్ హీరోయిన్‌ని తీసుకోకుండా పోర్న్ స్టార్‌నే ఎందుకు పెట్టారు అనే ప్రశ్న ఎదుర్కొన్న వర్మ.. తనదైన శైలిలో స్పందించారు. తన సినిమాకు ఫిగర్ అనేది ముఖ్యమని, అందుకు తగిన బాడీ మియా మాల్కోవాదే అని చెప్పారు. మియాను తీసేసి ఒక కలర్డ్ విమెన్‌ని పెట్టి తీస్తే ఆ ఎఫెక్ట్ కనిపించదని అన్నారు. ఎడారి, అమ్మాయి అందాలు పోటీపడి ఉండాలనేదే తన కాన్సెప్ట్ అని, ఓ ఇండియన్ హీరోయిన్‌కి అలాంటి డ్రెస్ వేస్తే ఆ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సే లేదని ఓపెన్‌గా చెప్పేశారు . Also Read: ఈ 'క్లైమాక్స్' మూవీని జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET వేదికపై విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు వర్మ. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉటుందని రేటు కూడా డిసైడ్ చేశారు. సో.. చూడాలి మరి విడుదల తర్వాత 'క్లైమాక్స్' మూవీ ఎలాంటి సంచలనాలకు తెర లేపుతుందో!.


By June 05, 2020 at 08:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-says-why-he-choose-porn-star-for-climax/articleshow/76207085.cms

No comments