Breaking News

RRR నుంచి ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ రెడీ... ఫ్యాన్స్‌కు పూనకాలే


ఎన్టీఆర్ , కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ బర్త్ డే కానుకంగా అదిరిపోయే వీడియో అభిమానుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు. మరి కొన్ని రోజుల్లో . దీంతో ఈ సారి తారక్ వీడియోను ఫ్యాన్స్‌కు బర్త్ డే గిఫ్ట్‌గా అందించేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. అంటే మరో ఆరు రోజుల్లో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'ఆర్ ఆర్ ఆర్' లో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదలనున్నారు. ఇప్పటికే వీడియోను రెడీ చేవారట. టీమ్ అంతా కూడా ఈ వీడియో పట్ల సంతృప్తికరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ వీడియో ఉంటుందని అంటున్నారు. ముందుగా చెప్పిన ప్రకారమే జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తేయగానే... ఇక మూవీకి సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదిలారు. ఆ వీడియోకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వీడియో కూడా అదే రేంజ్‌లో ఉంటుందని అభిమానులు ఎదరుచూపులు చూస్తున్నారు. RRR టైటిల్‌ను కూడా రాజమౌళి టీం ఖరారు చేసింది. ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అనే జెస్టిఫికేషన్ ఇచ్చారు. టైటిల్ లోగోతో పాటుగా ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన లుక్స్ ను కూడా ఇప్పటికే రిలీజ్ అయిపోయాయి. అది మోషన్ పోస్టర్ రూపంలో రిలీజ్ చేయడం విశేషం. ఎన్టీఆర్ వాటర్ మ్యాన్ గా, రామ్ చరణ్ ఫైర్ మ్యాన్ గా చూపించారు. 1.12 నిమిషాలపాటు ఉన్న ఈ మోషన్ పోస్టర్ మొత్తం విజువల్ వండర్ గా తీర్చి దిద్దారు. 1920 కాలం నాటి కథ అని ఆ టైటిల్ లోగోలో చూపించారు. RRR మూవీలో జూనియర్ యన్ టి ఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి వహిస్తున్నారు. డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


By May 14, 2020 at 10:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-team-gift-to-jr-ntr-on-his-birthday/articleshow/75730676.cms

No comments